అమెరికా చరిత్రలోనే అతి పెద్ద మాంద్యం : ట్రంప్
డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిస్తే అమెరికా చరిత్రలోనే అతి పెద్ద మాంద్యం వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మిషిగన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మిషిగన్ను శరణార్థుల శిబిరం చేస్తారని అన్నారు. డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారతీయ మూలాలున్న కమలా హారీస్ పేరును రిపబ్లికన్ సెనేటర్ ఒకరు వెక్కిరింపుగా పలకడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జియాలో నిర్వహించిన ప్రచార సభలో కమలా హారిస్ గురించి సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ మాట్లాడుతూ కాహ్-మహ్-లహ్? కహ్-మాహ్-లహ్? కమల-మల-మల? ఏదో నాకు తెలియదు అని వ్యాఖ్యానించారు. ఇది వివక్షాపూరిత ధోరణి అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.













