డొనాల్డ్ ట్రంప్ ఆశలపై ఫార్మా సంస్థల నీళ్లు!
ఎన్నికల్లోగా కరోనాకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడం ద్వారా మళ్లీ అందలం ఎక్కుదామన్నకున్న అమెరికా అధ్యక్షుడి ఆశలపై ఫార్మా కంపెనీలు నీళ్లు జల్లేందుకు సిద్ధమయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇవ్వడానికి సర్కారు సంసిద్ధమైనా వ్యాక్సిన్ ఎంతవరకూ సురక్షితం. సమర్థమైనదేనా? అనే విషయాల్ని శాస్త్రీయ విధానాల ప్రకారం, నిర్ణీత ప్రొటోకాల్ ప్రకారం పక్కాగా నిర్ధారించుకోకుండా వ్యాక్సిన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టలేమని సంయుక్త ప్రకటన వచ్చే ప్రయత్నాల్లో అవి ఉన్నాయని సమాచారం. ఈ మేరకు ఫైబర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు వచ్చేవారం ఒక ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిసింది.













