హెచ్-4 వర్క్ పర్మిట్ విధానం కొనసాగించాలి : భారతీయుల అభ్యర్థన
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పనిచేసుకునే అవకాశాన్ని కల్పించే హెచ్-4 వర్క్ పర్మిట్ విధానాన్ని ఎత్తేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన అనేక మంది ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఓ పిటిషన్‌ను వైట్‌హౌస్ వెబ్సైట్లో వేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయ సాంకేతిక నిపుణులందరినీ ఒక దరికి చేర్చే ఐటీ ప్రో అలయెన్స్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. లక్ష మంది నేరుగా అర్థించిన పక్షంలో అమెరికన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 43,332 మంది అనుకూలంగా సంతకాలు చేశారు.













