పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడంపై ఐక్యరాజ్య సమితి తలుపు తట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ పాక్‌కు మొట్టికాయలు వేసినా.. తీరు మాత్రం మార్చుకోవడం లేదు. కేవలం చైనా మద్దతు కూడగట్టుకొని ఐరాసలో నిర్వహించిన రహస్య భేటీలో కూడా దాయాదికి చుక్కెదురైంది. భారత్‌తో శాంతి యుతంగా చర్చలకు తాము సిద్ధం అంటూ మళ్లీ పాక్ కాళ్లబేరానికే వచ్చిన్నట్టు పాక్ ప్రకటనతో సృష్టమైంది. జమ్మూ కాశ్మీర్ వివాదం అనేది భారత్ అంతర్గత సమస్య అని, దీన్ని దైపాక్షి చర్చల ద్వారానే పరిష్కరించుకుంటే బాగుంటుందంటూ వివిధ దేశాలు పాకిస్థాన్ మొట్టి కాయలు వేశాయి. జమ్మూ అంశాన్ని ప్రపంచ స్థాయిలో చర్చకు దారితీశామని, ఐరాసను ఒప్పించి రహస్య సమావేశం ద్వారా మాట్లాడటం విజయం సాధించామంటూ పాక్ జబ్బలు చర్చుకోవడం విశేషం. ఐదుగురి పర్మినెంట్ సభ్యులు, 10 మంది నాన్ పర్మినెంట్ సభ్యుల సమక్షంలో చర్చలు జరిగాయి. అగ్ర దేశాల ప్రతినిధులందరూ పాక్‌ను చీకొట్టినా తామే గెలిచామంటూ చెప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.













