సన్నివేల్, శాన్ హోసె, డబ్లిన్, మిల్ పిటాస్ పాఠశాల కేంద్రాల ఆన్ లైన్ వసంతోత్సవం
అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సూచించిన సిలబస్‌తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే 17వ తేదీన ఆన్లైన్లో వైభవంగా జరిగింది. బే ఏరియాలో ప్రతి సంవత్సరం జరిగే పాఠశాల వసంతోత్సవ వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో విద్యార్థులతోపాటు, విద్యార్థుల తల్లితండ్రులు, టీచర్లు, నిర్వాహకులు పాల్గొన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తుంటారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతుంటారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి వసంతోత్సవం నిర్వహించలేని పరిస్థితుల్లో బే ఏరియా పాఠశాల నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా వసంతోత్సవ వేడుకలను చేద్దామని చెప్పడం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేయడంతో మే 9వ తేదీన కొన్ని కేంద్రాలతో, మే 17వ తేదీన మరికొన్ని కేంద్రాలతో ఆన్లైన్ ద్వారా వసంతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మే 17వ తేదీన జరిగిన ఆన్లైన్ వసంతోత్సవ వేడుకల్లో సన్నీవేల్, శాన్‌హోసె, డబ్లిన్, మిల్పిటాస్ పాఠశాల కేంద్రాల నిర్వాహకులు, టీచర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, తెలుగుభాషను ఇంత చక్కగా నేర్పిస్తున్న పాఠశాల టీచర్లకు అభినందనలు చెబుతూ, మన పిల్లలకు తెలుగు నేర్పించాలన్నదే తానా ఆశయమని చెబుతూ, ఈ ఆశయంలో పాఠశాల తరపున అందరూ పాల్గొని అందరికీ తెలుగు నేర్పించాలని కోరారు. ఆన్లైన్ విధానంతో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడివారికైనా తెలుగు భాషను నేర్పించడానికి అవకాశం లభించిందని దీనిని పాఠశాల ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు పద్యాన్ని పాడి వినిపించారు.
ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి కూడా మాట్లాడుతూ, పాఠశాల పిల్లలు బాగా చేశారని అభినందించారు. తానా తరపున ఎల్లప్పుడూ పాఠశాలకు మద్దతు ఉంటుందని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శనలు బావున్నాయని అంటూ, నిర్వాహకులను, టీచర్లను అభినందించారు.
ఆన్లైన్లో జరిగిన ఈ వసంతోత్సవంలో సన్నీవేల్, శాన్‌హోసె, డబ్లిన్, మిల్పిటాస్ కేంద్రాల పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ రకాల కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థులంతా వారి వారి ఇళ్ళలోనే ఉండి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. కొంతమంది విద్యార్థులు తెలుగు పద్యం ఆలపిస్తే, మరికొందరు కథలు, ఇతర విషయాలు చెప్పారు.
పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, పాఠశాల వసంతోత్సవం బాహుబలి 1 బాహుబలి 2లాగా ముగిసిందని, అందరూ చాలా చక్కగా చేశారని అభినందించారు. తానా నాయకత్వంలో పాఠశాల మరింతగా ముందుకెళుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మన టీవీలో టెలికాస్ట్ చేస్తున్నందుకు మన టీవీ సీఈఓ శ్రీధర్ చిల్లర గారికి పాఠశాల తరపున చెన్నూరి వెంకట సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల డైరెక్టర్ రమేష్ కొండ మాట్లాడుతూ, పిల్లలంతా తెలుగులో మాట్లాడటం, ప్రదర్శనలివ్వడం బావుందని చెప్పారు. తానా బే ఏరియా నాయకులు వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, సతీష్ వేమూరి కూడా మాట్లాడారు. మరో తానా నాయకుడు భక్తబల్లా కూడా అందరినీ అభినందించారు.
పాఠశాల మరో డైరెక్టర్ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, పాఠశాల వసంతోత్సవాన్ని ఇంత చక్కగా సమన్వయపరిచి నిర్వహించిన సన్నీవేల్, శాన్‌హోసె, డబ్లిన్, మిల్పిటాస్ టీచర్లకు అభినందనలు చెబుతూ, పిల్లలు ఇంత చక్కగా కార్యక్రమాలను ప్రదర్శించడానికి ముందుకురావడం చాలా సంతోషమన్నారు.
సన్నివేల్ పాఠశాల కేంద్రంకు చెందిన సురేష్ శివపురం (ఏరియా కో ఆర్డినేటర్), పద్మ సొంటి (సెంటర్ కో ఆర్డినేటర్), టీచర్లు డా. ఉమ గాయత్రి కె., ధనలక్ష్మీ, సువర్ణ జొన్నలగడ్డ, భార్గవి కొర్రపాటి, మానస, శాన్‌హోసె పాఠశాల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ దాశరథి (ఏరియా కో ఆర్డినేటర్), మూర్తి వెంపటి (టీచర్), డబ్లిన్ పాఠశాల కేంద్రానికి చెందిన శిరీష బత్తుల (ఏరియా కో ఆర్డినేటర్), శరత్ పోలవరపు (సెంటర్ కో ఆర్డినేటర్), టీచర్లు రజిత కె రావు, రవి పోచిరాజు, సరస్వతీ రావు, మిల్పిటాస్ కేంద్రంకు చెందిన హరి సన్నిథి (ఏరియా కో ఆర్డినేటర్), వరుణ్ ముక్క (సెంటర్ కో ఆర్డినేటర్), లక్ష్మీపతి (టీచర్) ఈ వసంతోత్సవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారు.
బే ఏరియా నాయకులు యశ్వంత్ కుదరవల్లి (ప్రెసిడెంట్) అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హరినాథ్ చికోటి (వైస్ ప్రెసిడెంట్), సుమంత్పుసులూరి (సెక్రటరీ), కొండల్రావు (ట్రెజరర్), అరుణ్ రెడ్డి (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ నాయకులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్ కమిటీ సభ్యులు వరుణ్ ముక్క, హరి సన్నిధి, బాటా అడ్వయిజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేశ్ కొండ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు అభినందించారు.
పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన, అడ్వయిజర్ విజయ ఆసూరి, పాఠశాల కరికులం డైరెక్టర్ డా. గీతామాధవి, వీరు ఉప్పల ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.






