మిచిగన్ లో అమరావతి కోసం గళమెత్తిన ఎన్నారైలు
ఆంధప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, వన్ స్టేట్ వన్ క్యాపిటల్ పేరుతో జూలై 3వ తేదీన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మిచిగన్‌లోని ఎన్నారైలు పాల్గొన్నారు. నార్త్విల్లే, నోవి, సౌత్ ఐవన్, లాన్సింగ్, ఫర్మింగ్టన్ హిల్స్, బ్లూమ్పీల్డ్ టౌన్షిప్ తదితర చోట్ల ఈ క్యాండిల్ లైట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొని అమరావతి ఒక్కటే రాజధాని అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు నాదెళ్ళ గంగాధర్‌తోపాటు సునీల్ పంత్ర, ప్రియా సునీల్ తదితరులు పాల్గొన్నారు.
లాస్ ఏంజెలిస్‌లో…
వన్స్టేట్ వన్ క్యాపిటల్…ఎపికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంచాలని కోరుతూ లాస్‌ఏంజెలిస్‌లో కూడా జూలై 3వ తేదీన తెలుగు ఎన్నారైలు క్యాండిల్ లైట్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమకుమార్ గొట్టి, చందు, సురేష్, లక్ష్మీనారాయణ, ప్రతాప్, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.














