మిల్ పిటాస్ లో కోడెలకు ఘనంగా నివాళి
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఎన్నారై తెలుగు దేశం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. కోడెల మృతిపట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై టీడిపి అభిమానులు పాల్గొన్నారు. ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం కోమటి మాట్లాడుతూ, పార్టీకి, రాష్ట్రానికి ఆయన ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, అంబటి సతీష్, భరత్ముప్పిరాల, విజయ గుమ్మడి, గాంధీ పాపినేని, రాజా కొల్లి, రజనీ కాకర్ల, రామ్, ఎంవి రావు, కోనేరు శ్రీకాంత్, వినయ్ పరుచూరి, యశ్వంత్ కుదరవల్లి, సురేష్ బబ్బూరి, హర్ష, రాజా తదితరులు పాల్గొన్నారు.













