AAA: ఎఎఎ మహాసభల్లో నాట్స్ నాయకులకు సత్కారం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటిసారిగా భారీ ఎత్తున ఫిలడెల్ఫియా (Phildelphia) లో నిర్వహిస్తున్న మొట్టమొదటి మహాసభల్లో నాట్స్ కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాట్స్ నాయకులను వేదికపైకి ఆహ్వానించి కమ్యూనిటికీ వారుచేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేసి వారిని ఎఎఎ నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు మొదటిరోజు జరిగిన కార్యక్రమాలు వచ్చిన అతిధులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎఎఎ నాయకులు, సభ్యులు, ఆహ్వానితులు, రాజకీయ, సినీ ఇతర రంగాల ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.







