కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసిన నాట్స్
కోవిడ్ 19 వైరస్‌తో అమెరికాలో తీవ్ర కష్టాలు పడుతోంది. ప్రపంచంలోని అత్యధిక కేసులు ఇప్పుడు అమెరికాలోనే నమోదవుతున్నాయి. లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడికోసం చేసిన లాక్‌డౌన్‌తో లక్షల మంది పేదలు, తక్కువ ఆదాయం ఉండే వేతన జీవులపై ఇది అధిక ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. బాధితులను ఆదుకునేందుకు నాట్స్ కరోనా రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసింది. దీంతో కరోనా ప్రభావ బాధితులకు సాయం అందించనుంది. ముఖ్యంగా పేదలకు ఆహారం అందించేందుకు పుడ్ బ్యాంక్‌లకు సాయం చేయడం.. కరోనాను నుంచి బాధితులను కాపాడేందుకు ప్రాణాలు తెగించి పోరాడుతున్న వైద్యులకు అవసరమైన సర్జికల్ మాస్కులను అందించాలని నాట్స్ నిర్ణయించుకుంది.
తెలుగు విద్యార్థులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పించటం.. మాతృదేశానికి వెళ్లేందుకు కావాల్సిన ఇమ్మిగ్రేషన్ సహాకారం అందించటం వైద్యసాయానికి కృషి చేయడం వంటి ముఖ్యమైన వాటిని నాట్స్ బోర్డు తన ఎజెండాను పెట్టుకుంది. నాట్స్‌లో ఎక్కువమంది తెలుగువైద్యులు సభ్యులుగా ఉన్నారు. దీంతో ఇప్పటికే నాట్స్ సభ్యులు వైద్యులకు సర్జికల్ మాస్కులు ఉచితంగా అందించే పనిచేస్తున్నారు. మరోవైపు కరోనా రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా దీనిని మరిత ముమ్మరం చేయడంతో పాటు ఈ కష్ట కాలంలో పేదలకు ఆహారం అందించేందుకు నాట్స్ కృషి చేయనుంది. మానవత్వంతో స్పందించే ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని కరోనా రిలీఫ్ ఫండ్‌కు అందించాలని నాట్స్ కోరుతోంది. పేదలెవరూ ఆకలితో ఎవరూ ఆలమటించకుండా చేయటంలో మనవంతు సాయం చేద్దాం రమ్మని నాట్స్ పిలుపునిస్తోంది.













