ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 160 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిది, పన్నెండు ఏళ్ళలోపు, పన్నెండు ఏళ్ల పైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.
నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, రామ్ నరేష్ కొమ్మనబోయిన, శ్రీనివాస్ భీమినేని, మురళీ మేడిచెర్ల, నాట్స్ సంబరాలు కల్చరల్ టీం సభ్యులు బిందు యలమంచిలి, శ్రీదేవి పులిపాక, తానా మిడ్ అట్లాంటిక్ రిప్రజెంటేటివ్స్ సునీల్ కోగంటి, భాస్కర్ మలినేని, వెంకట్ సింగు, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫిలడెల్ఫియా ప్రెసిడెంట్ బద్రి కునాపులి, రవితేజ మారినేని, టిఏజిడివి అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, ఉపాధ్యక్షులు రామ్మోహన్ తాళ్లూరి, పూర్వ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని తోడ్పాటుని అందించారు.
స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, రాధా గుంటూరి, నీలవేణి కందుకూరి, శ్రీదేవి ముంగర, భారతి అశోక్,సంయుక్త పుత్రయ, అనిషా ధరణిప్రగడ, విద్య షాపుష్కర్, వసంత తమ్మినేని, రిద్ధిమ, సౌజన్య కోగంటి, రఘు షాపుష్కర్, శిరీష వేదుల, ఈ సంబరాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి సుమన చాగంటి, సుమేధ గవరవరపు, అక్షయ పాల్యపూడి, స్నేహ ఇంద్రకంటి, అవంతిక వ్యాఖ్యాతలుగా వ్యవహరిం చారు. తెలుగు సినీగీతాల గానంతో పాటు నృత్యంతో చిన్నారులు అద్వైత్ బొందుగుల, శ్లోక విద్ధం, సాత్విక ప్రభ, స్నేహ ఇంద్రకంటిలు అలరిం చారు. తెలుగు బాల బాలికలను ప్రోత్సహించ డానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. బాలల సంబరాలను దిగ్వి జయవంతంగా నిర్వహించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు.













