అధ్యయనానికి నాట్కో క్లోరోక్విన్
కోవిడ్ 19 కట్టడిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఔషద తయారీ సంస్థ నాట్కో ఫార్మా తనవంతు పాత్ర పోషిస్తోంది. కోవిడ్ 19 వైరస్ నుంచి అత్యవసర వైద్య సేవల్లో ఉన్న సిబ్బంది రక్షణ కోసం జరుగుతున్న అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌కై ఉచితంగా క్లోరోక్విన్ ఫాస్పేట్ మాత్రలను యూఎస్‌లోని తన మార్కెటింగ్ భాగస్వామి అయిన రైసింగ్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా సరఫరా చేస్తోంది. కోవిడ్ 19 రిసర్చ్ ఔట్‌కమ్స్ వరల్డ్‌వైడ్ సెట్ వర్క్ (క్రౌన్) నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారం అందిస్తోంది. మలేరియా చిక్సితలో వాడే క్లోరోక్విన్ కోవిడ్ 19 వైరస్‌ను అడ్డుకుంటుందా లేదా తీవ్రతను తగ్గిస్తుందా అన్న విషయం తెలుసుకోవడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.






