మిచిగన్‌లో ఇండో-అమెరికన్ ప్రగతికి కృషి చేస్తాం : మురహరి దేబత్తిని
మిచిగాన్ ఇండో-అమెరికన్ల ప్రగతికి పాటుపడుతామని, యువ ఇండో అమెరికన్లకు రాజకీయాల్లో రాణించేందుకు కృషి చేస్తామని మిచిగాన్ ఇండియన్ అమెరికన్ డెమోక్రటిక్ కాకస్ (MIADC) పేర్కొంది. ట్రాయ్ కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మిచిగాన్ ఇండియన్ అమెరికన్ డెమోక్రటిక్ కాకస్ ఎన్నికల్లో మురహరి దేబత్తిని ని చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా జూలన్ ఛటర్జీ, కార్యదర్శిగా వేణు శ్రీదాస్యం, కోశాధికారిగా శ్రీని తొంటా, యూత్ ప్రతినిధిగా మానస్ పొన్నం, బోర్డు సభ్యులుగా నాగేశ్వర్ రఘుపాత్రుని, రాజేందర్ సిద్ధు, శ్రీరమ్య లంక, రమేశ్ రెడ్డి, ప్రశాంత్ పింగిలి, శ్రీధర్ వేజండ్ల, సురేశ్ కంచర్ల ఎన్నికయ్యారు. మిచిగాన్ డెమోక్రటిక్ పార్టీ విలువలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని కమిటీ పేర్కొన్నది. మిచిగాన్ ఇండో ` అమెరికన్ కమ్యూనిటీకి సేవ చేయడానికి, రాజకీయ అవగాహన పెంచడానికి కృషి చేస్తామన్నారు. స్థానిక, రాష్ట్ర సమాఖ్య స్థాయిల్లో మిచిగాన్ ఇండో ` అమెరికన్ల ప్రగతికి పాటుపడుతామని కమిటీ తెలిపింది. యువ ఇండో అమెరికన్లకు రాజకీయాల్లో రాణించేందుకు కృషి చేస్తామని చెప్పింది.













