ఎగ్జిట్ పోల్ ఫలితాలపై 19న ప్రకటిస్తా…

బే ఏరియాలో లగడపాటి ప్రకటన
మిల్‌పిటాస్‌లోని స్వాగత్ రెస్టారెంట్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్‌కెప్రసాద్, పార్లమెంట్ మాజీ సభ్యుడు, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎల్వీఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ప్రజల సంక్షేమంకోసం ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలు చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం?ఖాయమని చెప్పారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరంతరం సాగుతూనే ఉందని, ఎవరూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై 19వ తేదీన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడిస్తానని చెప్పారు. అలాగే తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల్లో తన అంచనా ఎందుకు లెక్కతప్పిందో కూడా చెబుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, విజయ ఆసూరి, గుమ్మడి కృష్ణ, వీరు ఉప్పల, లక్ష్మీపతి, సుబ్బయంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, సతీష్ అంబటి, శ్రీనివాస్ వీరపనేని, యశ్వంత్ కుదరవల్లి, రజనీకాకర్ల, చంద్రశేఖర్, సతీష్ బొర్రా తదితరులు పాల్గొన్నారు.