బంగారు తెలంగాణ కోసం ఎన్ఆర్ఐలు కృషి చేయాలి
జ్యూరిచ్‌లో ఎన్ఆర్ఐలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ నుంచి తెలుగు ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అమలును మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐలకు వివరించారు. ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని పునరుద్ఘాటించారు. ఉద్యమ లక్ష్యాల సాధన దిశగా ప్రయాణం మొదలైందన్నారు. కేసీఆర్ విజన్‌కు పలు రాష్ర్టాలు, కేంద్రం అభినందనలు తెలిపాయన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమన్నారు.
మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారు కూడ మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొని ఎన్ఆర్ఐలు అందరు కూడ మన తెలంగాణ అభివృద్ధి లో భాగస్వామ్యం కావలని కోరారు.
దీనిలో హైదరబాద్ మేయర్ బొంతు రాంమోహన్ గారు మరియు IT సెక్రెటరీ జేయేష్ నిరంజన్ గారు తదితరులు పాల్గొన్నారు.













