గాంధీ జయంతి వేడుకల్లో ఇర్వింగ్ మేయర్
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా, ఇర్వింగ్ (డాలస్) నగరంలో, ఐ.ఏ.ఎన్.టి ఆధ్వర్యంలో గాంధీ పీస్ వాక్ ను మహాత్మా గాంధీ 148 వ జయంతిని వందలాది మంది ప్రజల మధ్యలో ఘనంగా నిర్వహించింది. శాంతికి నిదర్శనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరూ తెల్లని టోపీలు, తెల్లని దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్, హుస్టన్ నగరం నుంచి కాన్సుల్ ఆఫ్ ఇండియా ఆర్.డి.జోషి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎం.జి.ఎం.ఎస్.టి. డైరక్టర్ షబ్నమ్ మోద్గిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన వారందరికీ అక్టోబర్ 2 తారీఖును యునైటెడ్ నేషన్స్ అహింసా అంతర్జాతీయ దినోత్సవగా ప్రకటించారని గుర్తు చేశారు.
రావు కల్వల, ఎం.జి.ఎం.ఎస్.టి సెక్రటరీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇర్వింగ్ సిటీ, కమ్యూనిటీ, అమెరికాలోనే అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను స్థాపించడానికి కలిసి పని చేసినందుకు చాలా సంతోషకరంగా ఉందని, దీనికి తోడ్పడిన వారందరికీ దన్యవాదాలు తెలిపారు. జాన్ హామండ్, ఎం.జి.ఎం.ఎస్.టి.కోచైర్ నిరంతరం కృషి చేస్తున్న ఎం.జి.ఎం.ఎన్.టి. బోర్డు సభ్యులను పరిచయం చేశారు. సల్మాన్ ఫర్షోరి, ఐ.ఏ.ఎన్.టి. అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గాంధీ పిస్ వాక్ గాంధీ సార్మక విగ్రహం వద్ద నిర్వహించడం ఉత్సహంగా ఉందని తెలిపారు. ఎంజిఎంఎన్టి చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని గాంధీ ఏ ఆయుధాలను ఉపయోగించకుండా స్వాతంత్య్రకోసం పోరాడారని చెప్పారు. ఆయన చూపిన బాటలోనే నడిచినప్పుడే శాంతి అన్నీచోట్లా నెలకొంటుందని చెప్పారు.













