మహాత్మునికి అమెరికా అత్యున్నత పురస్కారం
అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన కాంగ్రెసినల్ గోల్డ్ మెడల్‌ను మహాత్మాగాంధీకి బహూకరించే విషయమై ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యురాలు కారోలిన్ మలొనే ఈ విషయమై గత సెప్టెంబరులో అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అహింసను ప్రోత్సహించి, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహాత్మాగాంధీకి ఆయన 150వ జయంతి సందర్భంగా ఈ పురస్కారం ఇవ్వడం సమంజసంగా ఉంటుందన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, అంతర్జాతీయ అహింస ఫౌండేషన్లు నిర్వహించిన ఓ సభలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయమై ఇతర కాంగ్రెస్ సభ్యులను కలిసి ఒప్పించాలని భారత సంతతి పౌరులకు విజ్ఞప్తి చేశారు.













