గాంధీజీ లేఖకు 5 వేల డాలర్లు!
మహాత్మా గాంధీ లేఖ ఒకటి అమెరికాలో వేలానికి రానుంది. బాపూ ఆశీస్సులతో అని గుజరాతీలో సంతకం చేసిన ఈ లేఖను యశ్వంత్ ప్రసాద్ అనే వ్యక్తి చిరునామాతో ఉంది. దీనిపై తేదీ వివరాలు మాత్రం లేవు. అమెరికాకు చెందిన ఆర్ ఆర్ అనే వేలం నిర్వహణ సంస్థ దీన్ని అమ్మకానికి ఉంచింది. వేలంలో సుమారు 5 వేల డాలర్ల ధర పలుకుతుందని అంచనా వేస్తున్నట్లు వేలం నిర్వాహకులు ఒక ప్రకనటలో తెలిపారు. ఇందులో చరఖా గురించి ప్రస్తావించి మహాత్ముడు ప్రస్తావించారు. అవును నువ్వు చెప్పేది నిజమే. కానీ అది మగ్గంపై ఆధారపడి ఉంటుంది అంటూ బాపూజీ ఒక వ్యాఖ్యంలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చరఖా ప్రాధాన్యత వివరించినట్లు అవగతంలో అవుతోంది. స్వదేశీ ఉద్యమానికి జాతిపిత చరఖాను సంకేతంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రతి భారతీయుడు రోజు కొంత సమయం చరఖాపై నూలు వడకడం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతివ్వాలని గాంధీజీ అప్పట్లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.













