శాన్‌హోసెలో జూవెలరీ షాప్‌ను ప్రారంభించిన జయరామ్ కోమటి
శాన్‌హోసెలోని ఈస్ట్రిడ్జ్మాల్లో క్లాసిక్ డైమండ్ జూవెలరీ షాప్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నారైలు వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారని ప్రశంసించారు. తెలుగువారి వేడుకల్లో, బాటా, ఎఐఎలాంటి సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు ఈ జూవెల్లరీషాప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే
ఈ కార్యక్రమంలో తానా నాయకుడు సతీష్ వేమూరి, బాటా ప్రెసిడెంట్ శిరీష బత్తుల, బాటా అడ్వయిజర్ విజయ ఆసూరితోపాటు పలువురు ప్రముఖులు రజనీకాంత్ కాకర్ల, ప్రసాద్ మంగిన, వెంకట్ కోగంటి, రామ్ తోట, కరుణ్ వెలిగేటి, హరినాథ్ చికోటి, హరికృష్ణ రమేష్ కొండ, రవి తిరువీధుల తదితరులు పాల్గొన్నారు.













