మినల్ పటేల్ దవీస్ సేవలకు ప్రశంసలు…అధ్యక్ష పురస్కారం
హ్యూస్టన్‌లో ఉంటున్న మినల్ పటేల్ దవీస్ అనే మహిళకు అమెరికా అధ్యక్షుడి పురస్కారం లభించింది. మానవుల అక్రమ రవాణాపై చేసిన పోరాటానికి గానూ ఈ పురస్కారం ఇచ్చారు. మానవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్‌కు ఆమె సలహాదారుగా పనిచేశారు. శ్వేత సౌధంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పాంపియో చేతుల మీదుగా ప్రెసిడెన్సీ పతకాన్ని ఆమె అందుకున్నారు. అమెరికాలోనే అత్యున్నత గౌరవం దక్కినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. అమెరికాలో నాలుగో పెద్ద నగరం హూస్టన్‌లో మానవుల అక్రమ రవాణా నిరోధించేందుకు ఆ నగర మేయర్‌కు సలహాదారుగా ఆమె 2015లో నియమితులయ్యారు.













