రక్షణ వ్యయ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
నేషనల్ డిఫెన్స్ అధరైజేషన్ బిల్లు (ఎన్డిఎఎ) 2019కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దాదాపు 717 బిలియన్ డాలర్ల విలువైన వార్షిక రక్షణ వ్యయాన్ని ప్రతిపాదించిన ఈ బిల్లు 351-66 ఓట్లతో ఆమోదం తెలిపింది. వీటీతో పాటు భారత్తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా వ్యూహాత్మక ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబద్ధతకు సంబంధించిన అంశాలకు కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. సెనెట్ ఆమోదం కూడా పొందిన తరావాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తారు. అనంతరం అది చట్టరూపంలోకి వస్తుంది.













