ఆగస్టు 19న అమెరికాలో ఇండియా డే పరేడ్
భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వసుదైక కుటుంబకం అనే నినాదాన్ని విశ్వవ్యాప్తంగా చేయాలని ప్రవాస భారతీయులు యోచిస్తున్నారు. ఇండియా డే పరేడ్ అనేది ప్రవాస భారతీయులను ఐక్యం చేయడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దక్షిణ ఆసియాతో పాటు కరేబియన్ దేశాలు సైతం ఇందులో పాల్గొంటాయి. 38వ ఇండియా డే పరేడ్‌ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లో ఆగస్టు 19న నిర్వహించనున్నారు. నగరంలోని ప్రధాన వీధులగుండా పరుగు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇండో-అమెరికన్లు కలిసి కవాతుతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూయార్క్ లోని ఇండియా కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి మాట్లాడుతూ పరేడ్ అనేది ఇరు దేశాల మధ్య ఉన్న బంధం, స్నేహపూర్వక వాతావరణాన్ని తెలియజేస్తుందన్నారు.













