చైన్ మైగ్రేషన్‌కు స్వస్తి : ట్రంప్
నిరంతర వలస విధానానికి (చైన్ మైగ్రేషన్) స్వస్తి పలకనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, లాటరీ వీసా కార్యక్రమాన్ని కూడా వదిలించుకుంటామని సృష్టం చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెడ్ ఉల్లా అనే వలసదారుడే కారణం అని ఈ సందర్భంగా చెప్పారు. వీసా లాటరీ ప్రోగ్రాంకు, నిరంతర వలస విధానానికి మేం త్వరలోనే స్వస్తి పలుకుతాం అని ట్రంప్ పత్రికా సమావేశంలో తెలిపారు. లాటరీ కార్యక్రమం ద్వారా తమ దేశంలోకి చాలా చెడ్డవాళ్లు అడుగుపెడుతున్నారని, దీనిని ఇక భరించలేమని చెప్పారు. అలాంటి ప్రజలు తమ దేశానికి వద్దని, అలాంటి వారితో తనకు భయంగా ఉందని, అసహ్యం వేస్తుందని, నీచంగా అనిపిస్తోందని చెప్పారు. ఇక అమెరికా తిరిగి ఎప్పటిలాగా బలం పుంజుకుంటోందని, వేగంగా పునర్వైభవం సంతరించుకుంటుందని త్వరలోనే ప్రపంచమంతా చూస్తుందని తెలిపారు.













