వైట్‌హౌస్‌కు 1001 రాఖీలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా హరియాణాలోని ట్రంప్ గ్రామం (అసలు పేరు మరోరా) నుంచి 1001 రాఖీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపించారు. అమెరికా అధ్యక్షుడికి హర్యానా మహిళలు రాఖీలు పంపిస్తున్నారు. మహిళలపట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్‌కు రక్షాబంధనం పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో సోదరభావంతో 1001 రాఖీలు పంపటం విశేషం. 1800 జనాభా ఉన్న ఈ గ్రామాన్ని సులభ్ ఇంటర్నేషనల్ దత్తత తీసుకుంది. గ్రామంలోని మహిళలు ట్రంప్ ముఖంతో రాఖీలు తయారుచేసి.. రక్షా బంధన్ నాటికి(ఆగస్టు 7) ట్రంప్‌కు చేరేలా అమెరికాకు పంపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం కూడా 501 రాఖీలను తయారుచేశారు. తమ గ్రామంలో పర్యటించాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వాన పత్రాలు కూడా పంపారు. ట్రంప్, మోదీలను పెద్దన్నలుగా భావిస్తున్నామని.. వారిద్దరూ తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.













