తప్పుల తడకగా అమెరికా అధ్యక్షుడి ఆహ్వాన పత్రిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లలో తప్పులు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందుకు తాము మినహాయింపు కాదని, వైట్ హౌస్ అధికారులు నిరూపించారు. 115వ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా స్టేట్ యూనియన్ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వైట్ హౌస్ నుంచి సభ్యులకు ఆహ్వానం పంపించారు. ఈ ఇన్విటేషన్ కార్డుల మీద యూనియన్ కు బదులు యూనివోమ్ అని ఉండటంతో పలువురు విమర్శిస్తున్నారు. వైట్ హౌస్ అధికారులు ఇన్విటేషన్ ముద్రణ బాధ్యతలు తమ చేతుల్లో లేవని, తప్పును గుర్తించి తిరిగి వాటిని ముద్రించి పంపిణీ చేశామని పేర్కొన్నారు.













