వలసదారులపై మరో పిడుగు!
వలసదారులపై అమెరికా మరింత ఉక్కుపాదం మోపుతోందా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నాయి శ్వేతసౌధం వర్గాలు. యూఎస్ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికాలో ఒకరు స్థిరపడి ఆ తర్వాత అమ్మా, నాన్న, భార్యాపిల్లలు, దగ్గర బంధువులు ఇలా ఒకరి తర్వాత మరొకరిని తీసుకొచ్చి, ఆపై అంతా ఆ దేశ పౌరులుగా మారుతున్నారు. దీనికి చెక్ పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. శ్వేతసౌధం నుంచి వస్తున్న కథనాలతో చాలా మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే వలసవాదచట్టం వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విధానం మార్చాలనే ఆలోచనలో ఉంది.













