మోదీ నాకు అభినందనలు తెలిపారు : ట్రంప్
ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. అమెరికాలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై మోదీ అబ్బురపడ్డారని, భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారని తనను అభినందించారని ట్రంప్ చెప్పారు. నెవాడాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ భారత్తో పోలిస్తే అమెరికాలో 44 లక్షల కోరనా పరీక్షలను ఎక్కువగా నిర్వహించామని తెలిపారు. ఈ ఘనతపైనే మోదీ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని ట్రంప్ గుర్తు చేశారు. కరోనా కట్టడికి గట్టిగానే పోరాడుతున్నామనే సందేశాన్ని అమెరికన్ల లోకి పంపేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.













