యూఎస్ ఓపెన్ లో కసట్కినా శుభారంభం
యూఎస్ ఓపెన్‌లో 12వ సీడ్ కసట్కినా (రష్యా) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-2, 6-4తో జాక్వెలిన్ క్రిస్టియన్ (రొమేనియా)పై విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆమె రెండు ఏస్‌లు, 11 విన్నర్లు కొట్టింది. క్రిస్టియన్ 31 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఆంద్రీవా ( రష్యా), వెకిచ్ ( క్రొయేషియా) రెండో రౌండ్లో ప్రవేశించారు. తొలి రౌండ్లో ఆంద్రీవా 6-3, 7-6 (7-9)తో యువాన్ (చైనా)పై నెగ్గగా, వెకిచ్ 6-4, 6-4తో బిరెల్ (ఆస్ట్రేలియా) ను ఓడించింది.
మరోవైపు తొమ్మిదో సీడ్ సకారి ( గ్రీస్) గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రత్యర్థి వాంగ్ 6-2తో ఆధిక్యంలో ఉన్న దశలో సకారి రిటైరైంది. స్వితోలినా ( పోలెండ్), ప్యారీ ( ఫ్రాన్స్) కూడా ముందంజ వేశారు. మొదటి రౌండ్లో స్వితోలినా 3-6, 6-3 6-4తో మరియా కార్ల్ (అర్జెంటీనా) పై ప్యారీ 7-6 (7-2), 7-6 (7-5)తో జియు వాంగ్ (చైనా) పై నెగ్గారు. పురుషుల విభాగంలో హంబెర్ట్ ( ఫ్రాన్స్) శుభారంభం చేశాడు. ఆరంభ రౌండ్లో అతడు 6-3, 6-4, 6-4తో మాంటీరో (బ్రెజిల్)ను ఓడించాడు.







