అక్టోబరుకే కరోనా వ్యాక్సిన్ రెడీ : ట్రంప్
అమెరికన్లను కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడే వ్యాక్సిన్ అక్టోబర్లోనే అందుబాటులోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఏదైనా కొత్త వ్యాక్సిన్ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి సాగే పక్రియను, తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు వెచ్చించి వేగవంతం చేసిందని అన్నారు. జనవరి 2021 నాటికి తమ దేశంలో పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు అపరేషన్ వార్స్ స్పీడ్ పేరుతో తాము ప్రవేశపెట్టిన కార్యక్రమ లక్ష్యమని వివరించారు.













