2021 కల్లా కొవిడ్ వ్యాక్సిన్ : బిల్ గేట్స్
కరోనా వ్యాక్సిన్ 2021 సంవత్సరం తొలినాళ్లకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రారంభ దశలో సింహభాగం వ్యాక్సిన్ డోసులు ధనిక దేశాలకే పరిమితం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత విడుదలయ్యే కొవిడ్ వ్యాక్సిన్లు అస్వస్థత, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని కట్టడి చేయగల తాత్కాలిక ఉపశమాన్ని మాత్రమే అందిస్తాయన్నారు. అంతకంటే ప్రభావవంతమైన వ్యాక్సిన్లు రావాలంటే మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే ఏడాది చివరికల్లా కొవిడ్ గుప్పిట నుంచి ప్రపంచం విముక్తి పొందొచ్చని వ్యాఖ్యానించారు.













