ట్రంప్ వైఖరితో అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ 19
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 వైరస్ అమెరికాలో పెరిగిపోవటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ను ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రజలు కూడా సరైన పద్ధతులను పాటించడం లేదు. దాంతో అక్కడ ఈ వైరస్ విస్త•తమవుతోందని చెబుతున్నారు. యావత్ దేశాలన్నీ ఒకవైపు ఈ వైరస్ దెబ్బకు వణికిపోతుంటే అమెరికా మాత్రం చాలా నిర్లక్ష్యంగా కనిపించింది. దాని ఫలితమే ఇపుడు తెలుస్తోంది. నేడు కోవిడ్ 19 వైరస్ బాధితుల సంఖ్య సుమారుగా 70 వేలకు చేరుకుంది. దాదాపు 1200 మంది చనిపోయారు. అగ్రరాజ్యమైన అమెరికాలో అన్ని వేల కేసులు నమోదు కావటం ఏమిటి? వెయ్యిమందికి పైగా చనిపోవటమేంటి? అనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సరే మొదట్లో ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే కేసులు పెరిగిపోయాయని అనుకున్నా ఇపుడు కూడా అదే పద్దతిలో పోతున్నారంటే అర్ధం ఏమిటి ? ప్రపంచంలో దాదాపు 70 దేశాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. కానీ అమెరికాలో మాత్రం ఇంకా ఆ విషయమై జాతీయ స్ధాయిలో నిర్ణయం తీసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలోని జనాలు ట్రంప్ ను తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ఇప్పటి వరకూ 21 రాష్ట్రాలు మాత్రమే లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అంటే ఇవి కూడా తమ పరిధిలో వాటంతట అవే నిర్ణయం తీసుకున్నాయి కానీ దేశం మొత్తం మీద ఓ పాలసి అంటూ తీసుకోలేదని చెబుతున్నారు. లాక్ డౌన్ పాటిస్తే దేశం చాలా ఇబ్బదుల్లో పడిపోతుందని ట్రంప్ వాదిస్తుండటమే విచిత్రంగా ఉంది. అమెరికాను షట్ డౌన్ చేస్తే సమస్యకన్నా పరిష్కారం మరింత ప్రమాదకరంగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నాడు. కాని వైద్యులు మాత్రం ఇలాగే ఉంటే అమెరికాలో చావుల సంఖ్య బాగా పెరుగుతుందని చెబుతున్నారు.













