BEA2025: కమ్యూనిటీ, బిజినెస్ లీడర్స్ చేసిన అనౌన్సమెంట్
సాదారణంగా అవార్డుల ఫంక్షన్‌లలో అవార్డు తీసుకొనే వారు ఎంత పేరు ప్రతిష్ఠలు తెచ్చుకొని విజేతలు అవుతారో…. ఆ అవార్డుని ప్రకటించే వారు కూడా తమ తమ వృత్తులలో పేరుగాంచిన వారే ఉంటారు. ఎప్పటిలాగే తెలుగు టైమ్స్ (Telugu Times) తన మూడవ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ (Business Excellence Awards) కార్యక్రమానికి 14 క్యాటగిరీ లలో పేరొందిన ఎంట్రప్రెన్యూర్స్‌ని ఎంపిక చేయడమే కాక, ఆ అవార్డు లను ప్రకటించే పనికి అనేక మంది పెద్ద వారిని ఆహ్వానించడం, వారు కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
శ్రీ జయంత్ చల్లా – ఆటా ప్రెసిడెంట్, డా నరేన్ కోడాలి – తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్, శ్రీ శ్రీహరి మందాడి – నాట్స్ ప్రెసిడెంట్ , శ్రీ విశ్వేశ్వర్ కలవల – ఫౌండర్ ప్రెసిడెంట్ -GTA, శ్రీ శ్రీనివాస్ గనగోని – ఫౌండర్ ప్రెసిడెంట్ – MATA, శ్రీ రవి పొట్లూరి – బోర్డు అఫ్ డైరెక్టర్ – తానా, శ్రీ సుబ్రహ్మణ్యం ఓసూరు – ప్రెసిడెంట్ -న్యూ జెర్సీ చాప్టర్ -IT Serve, శ్రీ శ్రీ అట్లూరి – ఎడ్వైజరీ బోర్డు మెంబర్, శ్రీ శేఖర్ వెంపరాల – ఎడ్వైజరీ బోర్డు మెంబర్, శ్రీ మహేష్ సలాది – ఎడ్వైజరీ బోర్డు మెంబర్, శ్రీ దాము గెదల – కమ్యూనిటీ లీడర్, శ్రీ చంద్ర మందలపు – సీఈఓ, AXRIA, శ్రీ శ్రీకాంత్ అక్కపల్లి – హెడ్ TV9 USA ఒక్కొక్కరూ ఒక్కొక్క అవార్డుని ప్రకటించి వారి సందేశాన్ని ఇచ్చారు.
అలాగే ఆడియన్స్ లో శ్రీ ప్రవీణ్ తడకమళ్ల – ప్రెసిడెంట్ ఎలెక్ట్ – NRIVA, శ్రీ కిరణ్ దుడ్డగి – ప్రెసిడెంట్-MATA, శ్రీ మురళి చింతలపాణి – ఎడ్వైజరీ బోర్డు-TDF, శ్రీ శివ బి రెడ్డి – సెక్రటరీ -TTA జాతీయ తెలుగు సంఘం నాయకులు ఉన్నారు. తెలుగు సంఘాల నాయకులు శ్రీ మధు అన్న – ప్రెసిడెంట్, శ్రీ సుమంత్ రామిశెట్టి – ప్రెసిడెంట్ -TLCA, శ్రీమతి వాణి – ఫాస్ట్ ప్రెసిడెంట్ -NYTTA, మరియు శ్రీ హరి ఎప్పనపల్లి లాంటి అనేకమంది పుర ప్రముఖులు, అనేక మంది FIA నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ తెలుగు టైమ్స్ ధన్యవాదాలు.







