బోస్టన్ చెప్పిందేంటి?
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. వీటన్నింటి ఆధారంగా ఆయా దేశాల్లో కేసుల సంఖ్య పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటాయి? లాక్డౌన్ నిబంధనలు ఏ తేదీ నుంచి ఎత్తేయొచ్చు? అన్న అంశాలపై అంచనాలను సిద్దం చేసింది. గత నెల 25 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఆ నివేదిక రూపొందించినట్లు సృష్టం చేసింది.
భారత్లో కరోనా కేసులు జూన్ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని అంచనా కట్టింది. అప్పటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయని అభిప్రాయపడింది. లాక్డౌన్ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ భారత్లో జూన్ ఆఖరు నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో లాక్డౌన్ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా వేసింది. భారత్లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్డౌన్ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది.













