మిల్ పిటాస్ లో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అభిమానులు

తెలుగుజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ ఎన్టీరామారావు 22వ వర్థంతిని మిల్‌పిటాస్‌లోని స్వాగత్ ఇండియన్ కుజిన్‌లో జనవరి18వ తేదీన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపి బే ఏరియా నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలుగు దేశం పార్టీ పాలనలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, నేడు చంద్రబాబు ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలకు మేలు చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, శ్రీకాంత్ కె, యశ్వంత్ కుదరవల్లి, సతీష్ వేమూరి, భాస్కర్ వల్లభనేని, గాంధీ పాపినేని, కొల్లి రాజ, శివరామ్, రజనీకాకరాల, లియోన్ బోయపాటి, రామ్ తోట, కొల్లి నాని, హరి నల్లమల, ప్రసాద్ మంగిన, నవీన్ కొడాలి, మోహన్, సతీష్ అంబటి, వల్లూరిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.