టాటా విందు ఆహ్వానం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మిత్రులు, శ్రేయోభిలాషులకు ఏప్రిల్ 7 వ తేది సాయంత్రం ఫార్మింగ్టన్ హిల్స్, సెయింట్ తోమ చర్చ్నందు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున నిర్వహించు సాంస్కతిక మరియు విందు భోజన సమావేశానికి అందరికీ ఆహ్వనం పలుకుతున్నట్లు టాటా ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా చరిత్రలొ మొట్టమొదటి సారిగా రెండు గొప్ప జాతీయ తెలుగు సంఘాలు సంయుక్తంగా మే 31-జూన్ 2 వ తేది వరకు నిర్వహించబోతున్న తెలుగు సంబరాలు వాటి విశేషాలు మనఅందరితో పంచుకోవడానికి డాక్టర్. మల్లా రెడ్డి ఈ వేడుకలకు వచ్చేస్తున్నారని, అందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా టాటా అధ్యక్షుడు హరనాథ్ పులిచెర్ల కోరారు.













