తెలుగు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించిన ఆటా
అగ్రరాజ్యంలో చదువుకునే తెలుగు విద్యార్థులకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆర్థిక సాయం అందించింది. ఆటా ఏటా విద్యార్థులకు యూత్ స్కాలర్షిప్లు అందిస్తుందన్న సంగతి తెలిసిందే. కాలేజ్ ప్రోగ్రామ్స్‌లో ఎన్రోల్ అయిన హైస్కూల్ సీనియర్ స్టూడెంట్స్‌కు ఈ యూత్ స్కాలర్షిప్లను ఆటా అందిస్తుంది. విద్యార్థుల లీడర్షిప్ క్వాలిటీస్‌ను గుర్తించడంతోపాటు తెలుగు సంస్కృతితో వారి అనుబంధాన్ని పెంపొందిచేందుకు ఈ స్కాలర్షిప్లు అందిస్తున్నామని ఆటా ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు https://americanteluguassociation.org/2023-24-ata-scholars.php లింకులో లభిస్తాయి.
2023-24 ఆటా స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థులు..
1. సాయి కార్తికేయ చెరుకూరు
2. శ్రీజ చిట్టి
3. శ్రీరామ్ వెంకట దేవీ
4. అననయ్య ముంద్రాతి
5. అనన్య ముప్పిరాల
6. నికిత ఆర్ ముతకాన
7. మానసి తనికెళ్ల
8. మేఘ వి. రెడ్డి
9. కావ్య ఉప్పల
10. తన్మయి రెడ్డి వామిరెడ్డి













