27న ఎఐఎ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్, బాలీ 92.3ఎఫ్‌ఎం కలిసి సంయుక్తంగా దసరా దీపావళి వేడుకలను అక్టోబర్ 27వ తేదీన శాన్‌హోసెలోని శాంతాక్లారా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 40 సంఘాలు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరచిపోలేని విధంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పలు ఏర్పాట్లను చేస్తున్నారు. రావణ్ దహన్, రథయాత్ర, మహామంగళహారతి వంటి కార్యక్రమాలతోపాటు బాణాసంచాను పెద్దఎత్తున కాల్చనున్నారు. ఫ్యాషన్ షో, ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్స్‌తోపాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, గేమ్‌షోలు వంటివి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు మిల్‌పిటాస్‌లోని స్వాగత్ ఇండియన్ కుజిన్‌లో నిర్వాహకులు సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో బే ఏరియా ప్రముఖులు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, సంజయ్‌సేన్, రితేష్ ఆనంద్, రాజేష్ నాయర్, ప్రసాద్ మంగిన, విజయ ఆసూరి, సందీప్, కరుణ్ వెలిగేటి, వంశీ పాలడుగు, రామ్‌తోట, సాజు జోసెఫ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.