కొత్తగా విధించిన వీసా ఆక్షల విషయం లో విద్యార్థులకు మద్దతు గా 17 రాష్ట్రాలు
కరోనావైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం పెట్టిన కొత్త వీసా నిబంధనను నిరోధించాలని 17 అమెరికా రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సోమవారం హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖపై దావా వేసాయి.
ఈ విషయం పై మిసాచుసెట్స్ రాష్ట్ర ఆటార్ని జనరల్ మౌరాహీలే మాట్లాడుతూ యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) గత వారం విదేశాంగ శాఖ ప్రకటించిన ప్రకారం విద్యాలయంలో చేరిన విద్యార్థులకు, లేదా జరుగుతున్న సెమిస్టర్ కోసం పూర్తిగా ఆన్లైన్లో ఉన్న ప్రోగ్రామ్లకు ఎంచుకునే విద్యార్థులకు వీసాలు జారీ చేయదు, కానీ ఇప్పటికే వీసాలు ఉంటే, యు.ఎస్. కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విద్యార్థులను యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తాయి అని తెలిపాఋ. ఈ నియమం కోసం కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలచే కొన్ని నెలల తరబడి జాగ్రత్తగా కొత్త విద్య ప్రణాళికను రూపొందించాలి, మరియు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కావడంతో చాలా మంది విద్యార్థులను వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళమని చెపుతున్నట్టుగా వున్నాయి అని అన్నారు.
ఈ విషయం పై మరిన్ని విషయాలు చెపుతూ ‘ ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి తగిన ఆధారాలను వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. ఇది కళాశాలల వారు అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడం మరియు వారి క్యాంపస్ల ఆరోగ్యం మరియు భద్రతను పరిరక్షించుకోవడం వంటి నిర్ణయాలలో ఉండాల్సిన స్వేచ్ఛ ను తీసివేసినట్టే’ అని తెలిపారు. ఈ చర్య అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
బోస్టన్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ ని ప్రశనిస్తూ ఇది చట్టపరమైన ప్రయత్నం అని దీనిని కోర్టులో దాఖలు చేసిన రాష్ట్రాలు మరియు విశ్వవిద్యాలయాలు ట్రంప్ ప్రభుత్వం రాజకీయంగా ప్రేరేపించిన ప్రయత్నంగా భావించాలని, వ్యక్తిగతంగా ట్రంప్ ప్రభుత్వం ఆ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థల మీద ఒత్తిడి తీసుకువచ్చింది అని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఈ సెమిస్టర్ సమయం లో కరోనా వైరస్ కారణంగా చాలా విద్యాసంస్థలు ఎక్కువగా ఆన్లైన్లోనే క్లాసెస్ నిర్వహిస్తాం అని ప్రకటించినప్పటికీ. ఈ చట్టం ప్రకటించటం తప్పు అని తెలుపుతున్నారు. అలాగే ఈ కొత్త నిబంధనను అడ్డుకోవాలని కోరుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే కోర్టుకు వెళ్లిన తరువాత కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వ విద్యాలయం కూడా గత వారం తన సొంత దావా వేసింది. ఇప్పటికే హార్వర్డ్, ఎంఐటి కేసులో వాదనలు, మంగళవారం. 14 జులై 20 బోస్టన్లోని జిల్లా కోర్టులో కూడా విచారణకు రానున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు వారి చుట్టుపక్కల సమాజాల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆన్లైన్ మరియు వ్యక్తి తరగతుల మిశ్రమాన్ని అందించడానికి అనేక విశ్వవిద్యాలయాలు యోచిస్తున్నాయి కానీ, ఆన్లైన్ తరగతులు తీసుకోవడానికి మీకు వీసా లభించదు’ అనటం సరి కాదు’ అని విశ్లేషకులు చెపుతున్నారు.
ఐటీ ఈ విషయం లో మాట్లాడుతూ సాధారణంగా ఆన్లైన్ తరగతులు తీసుకుంటుంటే విద్యార్ధులకి కి వీసా ఎందుకు అని ప్రశ్నిస్తూ , విద్యార్థులు హాజరు కావడానికి – కోర్స్ కి సంబంధం లేకుండా ట్యూషన్ చెల్లించేలా చట్టం రావచ్చు.” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేళే మెకెన్నీ అన్నారు.
17 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో 1,124 కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, 2019 లో మొత్తం 373,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకున్నారని, వారు ఆ సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు 14 బిలియన్ డాలర్లను అందించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. యేల్, డెపాల్, చికాగో విశ్వవిద్యాలయం, టఫ్ట్స్, రగ్గర్స్, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్లలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థలు ఈ దావాకు మద్దతుగా ప్రకటనలు దాఖలు చేశాయి.













