ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న యాత్ర2
మమ్ముట్టి ప్రధాన పాత్రధారుడిగా మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన యాత్ర సినిమా ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు రిలీజై, మంచి హిట్ అందుకోవడంతో పాటూ ఎన్నికల్లో వైసీపీ కి చాలా హెల్ప్ చేసింది.
ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర2 సినిమా వస్తుంది. వైఎస్ చనిపోయాక జగన్ చేసిన ఓదార్పు యాత్ర, ఎలక్షన్స్ ముందు చేసిన పాద యాత్ర నేపథ్యంలో యాత్ర2 ని తెరకెక్కించారని సమాచారం. ఇందులో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించనున్నాడు. యాత్ర2 ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో చాలా గట్టిగా ఉంటుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాను యాత్ర సినిమా రిలీజైన ఫిబ్రవరి 8 రోజునే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ డేట్ ను సెంటిమెంట్ గా పెట్టుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ మూవీలో జగన్ పాలన గురించేమీ ఉండదని, కేవలం తన పాదయాత్ర గురించే ఉంటుందట. అంతేకాదు యాత్రలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి కూడా కాసేపు కనిపిస్తాడని, ఆయన చనిపోయే సీన్స్ కూడా ఇందులో ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా కూడా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు ఇటు వైసీపీ నేతలు మరియు దర్శకనిర్మాతలు.













