విఠల్వాడి ఫస్ట్ లుక్ విడుదల
హైదరాబాద్‌లోని విఠల్వాడి ఏరియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం విఠల్వాడి. రోహిత్ హీరో. టి.నాగేందర్ దర్శకడు. జి.నరేశ్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన జగపతిబాబు హీరోగా పరిచయమవుతున్న రోహిత్, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ఈ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. నిర్మాత మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి అన్నారు. చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. త్వరలో టీజర్ విడుదల చేస్తాం అని నిర్మాత నరేశ్‌రెడ్డి అన్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు నాగేందర్ తెలిపారు. సుధా రావత్, అమిత్, అప్పాజీ, చమ్మక్ చంద్ర, రోల్ రైడ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: ఎస్.ఎ.రెహమాన్, పూర్ణాచారి, సంగీతం: రోషన్ సాలూరి.













