దర్శకురాలిగా మారనున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
కథానాయికలు భానుమతి రామకృష్ణ నుండి, సావిత్రి, విజయ నిర్మల, జీవిత, జయ బి, నందిని రెడ్డి వరకు ఎందరో మహిళా దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నవారే. రెండు దశాబ్దాల పాటు లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కూడా దర్శకురాలిగా చేద్దామని చాల సార్లు ప్రయత్నాలు జరిగాయి. అది ఇప్పటికి కార్యరూపం దాల్చబోతుంది. చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. వయసుకు తగ్గ క్యారెక్టర్ తో హుందా గా నటించిన ఆమె మంచి సినిమా తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషమే. చిన్నపిల్లలా బ్యాక్ గ్రౌండ్ తో ఇటీవల ఒక్క చిత్రం రాలేదు ఆ మధ్య కోడిరామకృష్ణ దర్శకత్వం లో వచ్చిన దేవుళ్ళు కూడా 20 సంవత్సరాలు ఐయ్యింది. అయితే ఇప్పుడు విజయ శాంతి దర్శకురాలి గా ఒక చిన్నారి జీవిత కథ ఆధారంగా ఆమె సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఆమె కథను ఇప్పటికే సిద్దం చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ కథను ఆమె సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. తన సొంత సూరజ్ మూవీ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మాస్తారని తెలిసింది. ఆమె ఇప్పటికే కథను ఓ ఒక చిన్న హీరోకి కూడా చెప్పేశారు అని, ఆ సినిమాలో అతను కూడా నటిస్తాడు అని అంటున్నారు. ఆ సినిమాలో పాప తల్లిగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్నా ఒక మాజీ హీరోయిన్ నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజయశాంతి ఈ పాత్ర కోసం ఆమెను ఒప్పించారని టాక్. ఏదేమైనా సరే విజయశాంతి చాలా రోజుల తర్వాత దర్శకురాలిగా మారుతోన్న ఈ వార్త నిజమే అని అంటున్నారు. సినీ రంగంలో ఆమె కున్న అనుభవంతో ఆమెకు దర్శకురాలి గా మారాలి అనే కోరిక ఎప్పటి నుంచో ఉందని… అందుకే ఆమె ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అని చూస్తున్నారట.













