వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్ విడుదల
సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వజ్ర కవచధర గోవింద. అరుణ్ పవార్ దర్శకుడు. వైభవీ జోషీ కథానాయిక. నరేంద్ర, జీవీఎన్ రెడ్డి నిర్మాతలు. అదివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ గోవింద అనే అల్లరి దొంగ కథ ఇది. అతను దొంగ అయినా తనంటూ ఓ లక్ష్యం ఉంటుంది. అదేంటన్నది ఆసక్తికరం అన్నారు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన సన్నివేశాల్ని కర్ణాటకలోని ఓ ఆలయంలో చిత్రీకరిస్తామన్నారు. అర్చన, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ తదితరులు నటించారు. సంగీతం: విజయ్ బుల్గానిన్.













