ఇండస్ట్రీలోకి త్రివిక్రమ్ కొడుకు ఎంట్రీ
ఇప్పుడు టాలీవుడ్ మొత్తం నటుల వారసులతో నిండిపోయింది. ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేలవారు. కానీ ఇప్పుడలా కాదు. అన్ని విభాగాల నుంచి నుంచి వారి వారసులు నటులుగా మారుతున్నారు. డైరెక్టర్ల కొడుకుల్లో హీరోలైన వారున్నారు, నిర్మాతల కొడుకుల్లో హీరోలైన వారున్నారు. కానీ ఇప్పుడో డైరెక్టర్ కొడుకు మాత్రం యాక్టింగ్ వైపు వెళ్లకుండా తండ్రి దారిలోనే వెళ్లాలని డిసైడయ్యాడు.
అతను మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ కొడుకు రిషి. త్రివిక్రమ్ కు ఇద్దరు కొడుకులు, అందులో ఒకడు రిషి. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని రిషి నిర్ణయించుకున్నాడు. అలా అని రిషి తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడం లేదు. తండ్రి భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న ఒక సినిమాకు వేరే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.
సితార మరియు ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్లు కలిసి విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ కొడుకు రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. మొన్నటివరకు రిషి ఎలా ఉంటాడనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లినప్పుడు అక్కడ రిషి మీడియా కళ్లలో పడ్డాడు. అయితే రిషి చూడ్డానికి హీరోలా ఉన్నాడని అందరూ అంటున్నారు. కానీ రిషి ఏమో తండ్రి బాటలో వెళ్లాలని డిసైడయ్యాడు.













