జటాయుపై దిల్ రాజు భారీ నమ్మకం
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరోసారి భారీ రిస్క్‌తో కూడిన ప్రాజెక్ట్‌పై నమ్మకం ఉంచడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై విజయ్ దేవరకొండ(Vijay devarakonda) నటిస్తున్న రౌడీ జనార్ధన్(Rowdy Janardhan), డైరెక్టర్ వేణు ఎల్దండి(Venu Yeldandi) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎల్లమ్మ(Yellamma), అలాగే ఆశిష్ రెడ్డి(Asish Reddy) హీరోగా రూపొందుతున్న దేత్తడి(Dethadi) సినిమాలపై దృష్టి సారించిన దిల్ రాజు, ఇదే సమయంలో జటాయు(Jatayu) అనే భారీ మైథాలజికల్ ఫాంటసీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohankrishna Indraganti) గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ప్రారంభ దశలో ఈ సినిమాకు విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నప్పటికీ, ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యువ నటుడు రోషన్ మేకా(Roshan Meka) ఈ సినిమాలో హీరోగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్, విజువల్ డిజైన్, వీఎఫ్ఎక్స్ ప్రణాళికలపై ప్రత్యేకంగా పని జరుగుతుండగా, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అతిపెద్ద ఆసక్తికర అంశం దిల్ రాజు తీసుకున్న వ్యాపార నిర్ణయమే. ఇటీవల కాలంలో మోహనకృష్ణ ఇంద్రగంటి పెద్ద కమర్షియల్ విజయాన్ని అందుకోకపోవడం, రోషన్ మేకా ఇంకా కెరీర్ ప్రారంభ దశలో ఉండటం వంటి అంశాలు ఉన్నప్పటికీ, జటాయుపై దిల్ రాజు పూర్తి నమ్మకంతో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. కథ, కాన్సెప్ట్, విజువల్ ట్రీట్మెంట్పై ఉన్న విశ్వాసమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఈ సినిమా దిల్ రాజు అంచనాలను నిజం చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







