రామ్ చరణ్ సాలిడ్ లైనప్
టాలీవుడ్లో స్టార్ హీరోల కెరీర్‌ను కేవలం హిట్లు మాత్రమే కాకుండా, వారు ఎంచుకునే ప్రాజెక్టుల వ్యూహం కూడా నిర్ణయిస్తున్న కాలం ఇది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన ఫ్యూచర్ ప్లానింగ్ ను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ది(Peddi) రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ఆ సినిమా తర్వాత కూడా వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా, ముందుగానే స్ట్రాంగ్ డైరెక్టర్ లతో చర్చలు పూర్తి చేసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
చరణ్ తదుపరి సినిమాగా డైరెక్టర్ సుకుమార్(Sukumar)తో మరోసారి జతకట్టనున్నారనే విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) భారీ విజయాన్ని అందుకోవడంతో కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel)తో కూడా చరణ్ సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, బాలీవుడ్లో విజువల్ గ్రాండియర్‌కు ప్రతీకగా నిలిచిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela Bhansali) కూడా చరణ్‌కు ఓ కథను వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. విభిన్న శైలులకు చెందిన ముగ్గురు ప్రముఖ దర్శకులతో చరణ్ పేరు వినిపించడం ఆయన మార్కెట్ స్థాయి, డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రామ్ చరణ్ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యూచర్ లైనప్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.







