“ప్రస్థానం” డైరెక్టర్ తో సందీప్ కిషన్ అప్ కమింగ్ మూవీ..!?
సందీప్ కిషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో. గట్టిగా చూసుకుంటే ఈ హీరో కెరీర్ లో పెద్దగా హిట్టు సినిమాలు కనిపించవు. అయినా కూడా తన టాలెంట్ తో, యాక్టింగ్ తో ఈ యంగ్ హీరో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. చేసే ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ జోనర్ ని సెలెక్ట్ చేస్కోవడం సందీప్ కిషన్ ప్రత్యేకత. ఒక రకమైన మూస సినిమాలే కాకుండా, రకరకాల కథలతో ఈ హీరో ప్రయోగాలు చేస్తుండడం విశేషం. కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు సందీప్ కిషన్.
రీసెంట్ గా ” మైఖేల్ ” సినిమాతో ఈ హీరో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చాడు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎందుకో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రిలీజ్ కి ముందు భారీగా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఆఖరికి బాక్సాఫీస్ వద్ద మైఖేల్ డిజాస్టర్ గా నిలిచింది. చాలారోజుల తర్వాత వచ్చిన ఈ సినిమా పై సందీప్ కిషన్ కూడా బాగానే హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా దెబ్బతో సందీప్ అలెర్ట్ అయినట్లు సమాచారం.
ఈ హీరో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, కథ పై మరింత శ్రద్ధ పెట్టాలి అని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్థానం వంటి పోలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తో దేవా కట్టా ఇండస్ట్రీకి సూపర్ హిట్ మూవీ ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో కొంచెం ఎమోషనల్ టచ్ తో మాస్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సారైనా ఈ యంగ్ టాలెంట్ హీరో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.













