రేపు చెన్నైలో బాలు అంత్యక్రియలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనాతో దాదాపు 50 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలు ఈ రోజు మధ్యాహ్నాం 1:40 ని.లకు కన్నుమూసారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. సెప్టెంబర్ 4న బాలుకు నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. రేపు సాయంత్రం బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న తామరైపాకంలో బాలు అంత్యక్రియలు జరగనున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి నుంచి కోడంబాక్కంలోని ఎస్పీ చరణ్ ఇంటికి పార్టీవ దేహాన్ని తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం తర్వాత బాలు అంత్యక్రియలు జరగనున్నాయి.













