Munna Bhai3: మున్నా భాయ్3లో సౌత్ యాక్టర్
రాజ్ కుమార్ హిరాణి(Raj Kumar Hirani) దర్శకత్వంలో వచ్చిన మున్నా భాయ్(Munna Bhai) సిరీస్కు మంచి క్రేజ్ ఉంది. సంజయ్ దత్(Sanjay Dutt) ప్రధాన పాత్రలో వచ్చినా మున్నాభాయ్ ఎంబీబీఎస్(Munna Bhai MBBS), గే రహో మున్నా భాయ్(Ge Raho Munna Bhai) సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆ సినిమాలొచ్చిన చాలా కాలానికి ఇప్పుడు మున్నా భాయ్3(Munna Bhai3) ని ప్లాన్ చేస్తున్నాడట రాజ్ కుమార్ హిరాణి.
ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ లో ఉందని, మూడో భాగాన్ని కూడా రాజ్ కుమార్ సంజయ్ దత్ తోనే ప్లాన్ చేస్తున్నాడని టాక్. అయితే ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)ని తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. మున్నాభాయ్ లాంటి సినిమాలకు సేతుపతి మంచి ఛాయిస్. రాజక్ కుమార్ హిరాణీ స్టోరీ రెడీ చేయగానే ఈ సినిమాకు సంజు భాయ్ రెడీ అంటాడు.
అయితే ఈ సినిమాలో సేతుపతి నటించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సేతుపతి నటిస్తే మాత్రం ఈ సినిమాకు హైప్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మున్నా భాయ్3ని కేవలం బాలీవుడ్ లోనే చేస్తారా లేదా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.













