శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘తోటబావి’ ఫస్ట్ లుక్
యాంకర్ రవి హీరోగా గౌతమి హీరోయిన్గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స పతాకంపై అంజి దేవండ్ల దర్శకత్వంలో ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్ర తోటబావి. దౌలు.బి, చిన్నస్వామి.బి, అభినేష్.బి సహనిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా విడుదలైంది. దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం తోటబావి. హీరో రవిగారు ఇచ్చిన సపోర్టుతో సినిమాను బాగా తీయగలిగాం అన్నారు. నిర్మాత ఆలూర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మా దర్శకుడు కథ, కథనాలు చాలా గొప్పగా తయారు చేసుకున్నారు. అదే విధంగా తెరకెక్కించారు. మా హీరో రవి గారి సపోర్టు మరువలేనిది అన్నారు. హీరోగా నటించిన యాంకర్ రవి మాట్లాడుతూ టైటిల్ లాగే సినిమా అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అన్నారు.













