సర్కారు వారి పాట టీజర్ ఎప్పుడంటే..!
మహేష్ బాబు, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కరోనా ఫస్ట్ వేవ్ ఫ్రీ అయ్యాక దూబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ లో కీ సీన్స్, ఒక సాంగ్, ఛేజింగ్ సీన్లు తీసి ఆ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేసింది యూనిట్. ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ లో షూటింగ్ జరుగుతుంది. కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్న మహేష్, ఈ సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
త్రివిక్రమ్ తో దాదాపు మూవీ సెట్ అయిన నేపథ్యంలో సర్కారు వారి పాటను త్వరగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడట మహేష్. సర్కారు వారి పాటను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేసి, రాజమౌళి తో సినిమా చేసే లోపు త్రివిక్రమ్ తో సినిమాను కంప్లీట్ చేయాలనే దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఆగస్టు కు పూర్తి చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కారణంగా ఇంకా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మహేష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవలేదు. జస్ట్ టైటిల్ ను మాత్రమే రివీల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ త్వరలోనే రాబోతుందనే లీక్స్ అందుతున్నాయి. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్న యంగ్ యాక్ట్రెస్ స్వప్నిక సోషల్ మీడియా వీదికగా దీని గురించి హింట్ ఇచ్చేసింది. రీసెంట్ గా ఇన్ స్టా లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నిర్వహించిన స్వప్నిక కు సర్కారు వారి పాట టీజర్ మే 31న ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని అడగ్గా, చేయొచ్చేమో అనే రిప్లై ఇచ్చింది. దీంతో ఆ రోజునే టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ తో ఫ్యాన్స్ కు మహేష్ ట్రీట్ ఇస్తాడేమో చూడాలి.













