నాని స్పీడు పెంచాలిక!
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా రిలీజ్ కు పట్టుమని నెల రోజులు కూడా లేదు. గత రెండ్రోజుల నుంచి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడంలో భాగంగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ స్పీడ్ సరిపోవడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన పనేం లేదు. రిలీజ్ కు మరో నాలుగు శనివారాలున్నాయి. దానికి తోడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఆగస్ట్ 29న ఎలాంటి పోటీ లేదు.
దానికి ముందు వారం రావు రమేష్ నటిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం తప్ప ఏ సినిమా రావడం లేదు. నాని సినిమాకు అదేం పోటీ కాదు. ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యే సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా అప్పటికి రెండు వారాలవుతుంది కాబట్టి స్లో అవుతాయి. ఈ అంశం నాని సినిమాకు కలిసిరానుంది. కాకపోతే సెప్టెంబర్ 5న విజయ్ గోట్ రిలీజ్ కానుందంటున్నారు. ఆ సినిమా పోస్ట్ పోన్ అవకపోతే నాని సినిమాకు చిక్కు ఎదురవడం ఖాయం. కాబట్టి సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం ఎంతో అవసరం. ఈ సినిమాపై నాని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.













